‘ఓం నమో వేంకటేశాయ’ ట్రైలర్‌

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌ కీలక పాత్రల్లో నటించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నాగార్జున సోషల్‌మీడియా ద్వారా దీన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆదివారం రాత్రి ఈ చిత్రం ఆడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. జగపతిబాబు, సౌరభ్‌, విమలా రామన్‌ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 10న ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Source: ఈనాడు

Posted On 9th January 2017