లారెన్స్‌ ‘శివలింగ’ ట్రైలర్‌

రాఘవ లారెన్స్‌, రితికా సింగ్‌ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘శివలింగ’. పి.వాసు దర్శకుడు. రమేష్‌ నిర్మాత. సోమవారం ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. కన్నడలో విజయం సాధించిన ‘శివలింగ’ కథని లారెన్స్‌తో తెరకెక్కించారు. పి.వాసు తనయుడు శక్తివాసు కీలక పాత్రలో నటించారు. ‘చంద్రముఖి’లా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. ‘ఈ ఛాలెంజింగ్‌ కేసులో ఈ శివ.. శివలింగేశ్వర్‌ ఓడిపోడు బాబా’ అంటూ లారెన్స్‌ పలికే సంభాషణలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Posted On 23rd January 2017