‘కాటమరాయుడు’ టీజర్‌

‘ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం’ అంటున్నారు పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఇందులో పవన్‌ ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతూ కనిపించారు. టీజర్‌లో ‘రాయుడూ..’ అంటూ వస్తున్న నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. కిశోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిక. శరత్‌మరార్‌ నిర్మాత. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఉగాదికి ‘కాటమరాయుడు’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Posted On 4th February 2017