‘కిట్టుగాడు..’ టీజర్‌

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రం ప్రత్యేక టీజర్‌ ఆకట్టుకుంటోంది. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో 5 స్థానంలో ఉండటం విశేషం. టీజర్‌లో రాజ్‌తరుణ్‌, కథానాయిక అను ఇమ్మాన్యుయేల్‌ మధ్య సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పృథ్వీ, నాగబాబు, రఘుబాబు, రాజా రవీంద్ర, తాగుబోతు రమేశ్‌, ప్రవీణ్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Posted On 2nd January 2017