‘ఖైదీ నంబర్‌ 150’ నీరు నీరు సాంగ్

రైతులు నీరు కోసం పడే కష్టాల్ని చెబుతూ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రంలోని ఓ పాటను రికార్డు చేశారు. ‘నీరు నీరు నీరు.. రైతు కంట నీరు..’ అని సాగే ఈ పాటను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. రైతులకు ఈ పాటను అంకితం ఇస్తున్నట్లు పేర్కొంది. శంకర్‌ మహదేవన్‌ ఆలపించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Posted On 5th January 2017