Foodpanda CPS (IN)
ఖైదీనంబర్ 150 థియేట్రికల్ ట్రైలర్

‘పొగరు నా ఒంట్లో ఉంటంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటంది’ అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. వి.వి.వినాయక్‌ దర్శకుడు. శనివారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో చిరు చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ‘కష్టం వస్తదో.. కార్పొరేట్‌ సిస్టమ్‌ వస్తదో రమ్మను’.. ‘వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా! కందిపప్పు నుంచి కరివేపాకు దాకా! మినప నుంచి మిరప దాకా! అన్ని ఆ పల్లెల నుంచే రావాలి’.. అంటూ చెప్పే డైలాగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Posted On 7th January 2017