‘చెలియా’ ట్రైలర్‌

‘నువ్వు నన్ను ప్రేమించిన దానికంటే నేను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తా. నువ్వు ద్వేషించినా ప్రేమిస్తా, నువ్వు ఇష్టపడకపోయినా ప్రేమిస్తా’.. అంటున్నారు నటుడు కార్తీ. ఆయన హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన ‘చెలియా’ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. అందులో కార్తీ కథానాయిక అదితిరావు హైదరిపై తనకున్న ప్రేమను ఈ విధంగా తెలుపుతూ కనిపించారు.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. పైలట్‌, వైద్యురాలికి మధ్య చిగురించిన ప్రేమ కథే ఈ చిత్రం. త్వరలో ‘చెలియా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: ఈనాడు

Posted On 9th March 2017