Foodpanda CPS (IN)
‘దువ్వాడ జగన్నాథమ్‌’ టీజర్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా టీజర్‌ విడుదలైంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్‌లో అల్లు అర్జున్‌ బ్రాహ్మణుడి గెటప్‌లో సందడి చేస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ‘ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామని’ అంటూ బన్నీ చెప్పే డైలాగ్‌ సరదాగా అనిపిస్తోంది.

హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే కథానాయికగా నటిస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Posted On 24th February 2017