‘మిరామిరా మీసం’ తిప్పిన కాటమరాయుడు

 ‘కాటమరాయుడు’ సందడి షురూ అయింది. ‘రాయుడూ..’ అంటూ ఇటీవల టీజర్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘మిరామిరా మీసం.. మెలి తిప్పాడు జన కోసం’ అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. పంచె కట్టి, చేతిలో కత్తిపట్టి, మీసం మెలేసి రంగంలోకి దిగిన ‘కాటమరాయుడు’ జనం కోసం ఏం చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. శ్రుతిహాసన్‌ కథానాయిక. డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌మరార్‌ నిర్మాత. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. శుక్రవారం తొలి పాటను విడుదల చేశారు. ప్రతీ రెండు రోజులకూ ఓ పాట విడుదలవుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈనెల 18న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తారు. మార్చి 24న ‘కాటమరాయుడు’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Source: Eenadu

Posted On 4th March 2017