రాధ ‘ఖాకీ చొక్కా..’ సాంగ్

శర్వానంద్‌ హీరోగా చంద్రమోహన్‌ దర్శకత్వంలో ‘రాధ’ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ‘ఖాకీ చొక్కా..’ అనే పాటను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. లావణ్య త్రిపాఠి ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇందులో శర్వానంద్‌ నవ్వించే పోలీసుగా కనిపించనున్నారు. రధన్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

Source: Eenadu

Posted On 9th March 2017