కాటమరాయుడు ‘లాగే మనసు లాగే...’ సాంగ్

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం పాటల సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రంలో ‘మిరామిరా మీసం..’ అనే పాటను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో పాటను విడుదల చేసింది. ‘లాగే మనసు లాగే నీవైపే నను లాగే..’ అని మొదలయ్యే ఈ పాట యూట్యూబ్‌లో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ‘ఓ పిల్లా.. ఓ పిల్లా.. అరె కాటమరాయుడు గుండెను అట్టా కాటావేసి పట్టుకుపోయావే..’ అని చరణంలో వినిపించారు.

డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్చి 24న ‘కాటమరాయుడు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Source: ఈనాడు

Posted On 9th March 2017