నయూమ్ తో బండ్ల గణేష్, అశోక్ కుమార్, సి కల్యాణ్ కు సంబంధాలు

గ్యాంగ్‌స్టర్‌ నయీంకు తెలుగు సినిమా పరిశ్రమతోనూ సంబంధాలున్నాయని నిర్మాత నట్టికుమార్‌ పేర్కొన్నారు. నయీం.. బండ్ల గణేష్, సి కల్యాణ్, అశోక్ కుమార్, సచిన్ జోషి తో కలిసి సెటిల్‌మెంట్లు చేశాడని ఆరోపించారు. ఉత్తరాంధ్రలోని సినిమా థియేటర్లలో క్యాంటీన్ల నిర్వహణంతా ఇప్పటికీ నయీం అనుచరులే చూసుకొంటున్నారని చెప్పారు. ఒక థియేటర్‌ విషయంలో తనకీ బెదిరింపులొచ్చాయని, ఓ స్థలం విషయంలో కిడ్నాప్‌ చేసేందుకు కూడా ప్రయత్నించారన్నారు. సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో నట్టికుమార్‌ మాట్లాడారు.

Posted On 23rd August 2016