కళ్యాణ్‌రామ్‌ ‘ఇజం’ టీజర్‌

కళ్యాణ్‌రామ్‌ హీరోగా పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇజం’ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ జర్నలిస్టు పాత్రలో, సిక్స్‌ప్యాక్‌తో కనిపించనున్నారు. 2015లో మిస్‌ ఇండియా కిరీటం గెలుచుకున్న అదితి ఆర్య ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌రామ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి, అలీ, వెన్నెల కిషోర్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Posted On 6th September 2016