ఇజం మేకింగ్ వీడియో

జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలను చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నందమూరి కల్యాణ్‌రామ్‌. అంతేకాదు ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై సినిమాలు నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక కథానాయకులను పక్కా మాస్‌గా చూపించడంలో పూరి జగన్నాథ్‌ శైలే వేరు. ‘ఇడియట్‌’ నుంచి ‘లోఫర్‌’ వరకు ఆయన సినిమాల్లో హీరోలు రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉంటారు. కల్యాణరామ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇజం’. గత చిత్రాలకు భిన్నంగా కల్యాణ్‌రామ్‌ ఈ చిత్రంలో కన్పిస్తున్నారు.

ఇటీవల ఓ సందర్భంలో కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో సిక్స్‌ప్యాక్‌ చేసిన చివరి హీరో తానే అవుతానేమో అని నవ్వుతూ అన్నారు. సిక్స్‌ప్యాక్‌ కోసం మూడు నెలల పాటు కష్టపడి, దాదాపు పది కిలోలు తగ్గారు. మరి కల్యాణ్‌రామ్‌లోని ‘ఇజం’ చూపించడానికి ఏ విధంగా సిక్స్‌ప్యాక్‌తో తయారయ్యారో తెలుపుతూ దర్శకుడు పూరి ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈనెల 21 ‘ఇజం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Posted On 17th October 2016