‘బాహుబలి-2’ వర్చువల్ రియాలిటీ వీడియో

ఆ విజువల్ వండర్స్... ఆ ఫైట్ సీన్స్.. అబ్బో.. చూడ్డానికి రెండు కళ్లూ చాలవనుకోండి. అందుకే మనకు దేవుడు ఇచ్చిన రెండు కళ్లకు ఏఎండీ రేడియోన్ టెక్నాలజీస్ గ్రూప్ తయారు చేసిన వీఆర్( వర్చువల్ రియాలిటీ) హెడ్‌సెట్ పెట్టుకుంటే బాహుబలి సెట్స్‌లో జరుగుతునన్న అద్భుతాలను కళ్లకు ‘కట్టి’నట్లు చూడొచ్చట. అంతేకాకుండా మనం ఆ సెట్స్‌లో ఉన్న అనుభూతిని కూడా పొందుతామట. ‘ఆన్ ది సెట్స్ ఆఫ్ బాహుబలి’ పేరుతో బాహుబలి టీమ్ రిలీజ్ చేసిన వీడియోను వీఆర్ హెడ్‌సెట్ ద్వారా తిలకిస్తే ‘బాహుబలి-2’ సెట్స్‌కు వెళ్లినట్టే అని దర్శకుడు రాజమౌళి చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియోని ఎలా చూడాలి అనే దాన్ని కూడా రాజమౌళి మరో వీడియో ద్వారా వివరించారు. పై వీడియోలో అనుష్క, రానా ఒకరితర్వాత ఒకరు వీక్షకులకు బాహుబలి సెట్స్‌ను పరిచయం చేస్తున్నట్లు చిత్రీకరించారు. నేడు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు ఈ వీడియోని కానుకగా ఇస్తున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు.

Posted On 23rd October 2016