చైనాలో కెమెరాకు చిక్కిన ‘డ్రాగన్’

చైనాదేశానికి డ్రాగన్ అనే పేరు రావడానికి కారణం ఒకప్పుడు అక్కడ డ్రాగన్‌లు సంచరించాయనడమే. కానీ ఎవరైనా, ఎప్పుడైనా డ్రాగన్‌లను చూశారా అంటే ఎవరూ చూడలేదు. కానీ యూటూబ్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ వీడియోలో రెండు కొండల మధ్య డ్రాగన్ ఆకారంలో ఉన్న పెద్ద జీవి ఎగురుతూ కనిపించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వీడియోని చైనాకు చెందిన ఎపెక్స్ చానెల్ రికార్డ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై పలు ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. డ్రాగన్స్ ఈ విధంగా ఉండవని, ఇది ఫేక్ వీడియో అని కొందరు ఖండిస్తుండగా, మరికొందరూ డ్రాగన్‌గానే వర్ణిస్తున్నారు. మరికొందరైతే గ్రహాంతర వాసులేమోనని అభిప్రాయపడుతున్నారు. వీడియోని రికార్డు చేసిన టీవీ యాజమాన్యం మాత్రం మార్ఫింగ్ చేయాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నిస్తోంది. దీంతో ఈ వీడియో పలురకాల ఆసక్తికరమైన చర్చలు జరగుతున్నాయి.

Posted On 24th October 2016