‘రెమో’ ట్రైలర్‌

తమిళ నటుడు శివకార్తికేయన్‌, కీర్తీసురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రెమో’. తమిళంలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో నిర్మాత దిల్‌రాజు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కథానాయిక సమంత ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. దిల్‌రాజుతోపాటు కీర్తీసురేశ్‌, శివకార్తికేయన్‌, అనిరుధ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం సమకూర్చారు. సతీశ్‌, కేఎస్‌ రవికుమార్‌, రాజేంద్రన్‌, యోగి బాబు తదితరులు ‘రెమో’ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Posted On 2nd November 2016