‘జయమ్ము నిశ్చయమ్మురా’ ట్రైలర్‌

ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి కథానాయకుడిగా నటిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. 2013.. తెలుగు ప్రజలు ఒక రాష్ట్రంగా ఉన్న నేపథ్యంలో అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగిగా శ్రీనివాస్‌రెడ్డి కన్పిస్తారు. కరీంనగర్‌లోని ఓ మారుమూల గ్రామం నుంచి ఉద్యోగం నిమిత్తం కాకినాడ చేరుకున్న అతను మళ్లీ ట్రాన్సఫర్‌ ద్వారా తిరిగి సొంత ప్రాంతానికి రాగలిగాడా? ఈ ప్రయత్నంలో ఎన్ని కష్టాలుపడ్డాడనేదే కథాంశంగా ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత కృష్ణభగవాన్‌ మళ్లీ తనదైన శైలిలో అలరించబోతున్నాడు. అతనికి తోడు పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌లతో మంచి వినోదం అందించబోతున్నట్లు దర్శకుడు శివరాజ్‌ కనుమూరి చెప్పకనే చెప్పేశాడు. శివరాజ్‌ ఫిల్మ్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు రవిచంద్ర సంగీతం అందిస్తున్నాడు. పూర్ణ కథానాయిక. నవంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Posted On 14th November 2016