మైదానంలో పుజారాపై కోహ్లీ ఆగ్రహం

ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ, పుజారాలు సెంచరీలతో కదం తొక్కారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిడియా 4 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో పుజారాను రెండు సార్లు కోప్పడ్డాడు కోహ్లీ. 18వ ఓవర్‌లో పుజారా షాట్ కొట్టి సింగిల్ తీసి రెండో పరుగుకు ప్రయత్నించాడు. అయితే కోహ్లీ వద్దని వారించడంతో బ్యాట్ వదిలేసి పరిగెత్తి మరీ డైవ్ చేశాడు. తృటిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తర్వాత కూడా మళ్లీ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు పుజారా. దీంతో కెప్టెన్ కోహ్లీ జాగ్రత్తగా ఉండాలంటూ కోపగించుకున్నాడు.

Posted On 17th November 2016