భూమి మీద దేవతలు తిరుగుతుంటే.. యుద్ధాలు తప్పవు బావా

 మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గుంటూరోడు’ (ఉపశీర్షిక: లవ్‌లో పడ్డాడు). ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను మనోజ్‌ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఇందులో మనోజ్‌ ‘భూమి మీద దేవతలు తిరుగుతుంటే.. యుద్ధాలు తప్పవు బావా’ అని డైలాగ్‌ విసురుతూ కనిపించారు. ఎస్‌.కె. సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీవరుణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్‌, ఆర్ట్‌: సత్య శ్రీనివాస్‌, ఎడిటర్‌: కార్తిక్‌ శ్రీనివాస్‌.

Posted On 19th November 2016