ఏటీఎం చనిపోయింది....డోంట్ మిస్ దిస్ వీడియో

నోట్ల కోసం జనం ఏటీఎం సెంటర్ల ముందు, బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. అయితే దేశంలో చాలావరకూ ఏటీఎంలు ఇప్పటికీ మూతబడే ఉన్నాయి. ఎప్పటికి తెరుచుకుంటాయో క్లారిటీ లేదు. ఏటీఎంలు మూతబడటంపై తమిళనాడులోని కోయంబత్తూరులో నిరసనకారులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఏటీఎం సెంటర్ డోర్‌కు దండేసి అంత్యక్రియలు చేశారు. శవం ముందు ఏడ్చినట్లు ఏటీఎం సెంటర్ ముందు బిగ్గరగా ఏడ్చారు. ఈ వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో మీకోసం...

Source: ఆంధ్రజ్యోతి 
Video Source: ది న్యూస్ మినిట్

Posted On 20th November 2016