Foodpanda CPS (IN)
మోదీ నిర్ణయాన్ని స్వాగతించాలి

పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం.. దేశ భవిష్యత్‌ను మార్చడం తథ్యమని సినీనటుడు నాగబాబు అభిప్రాయపడ్డారు. 70ఏళ్ల స్వతంత్రదేశంలో గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచారని కొనియాడారు. దేశంలో ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని నిలబడిన ప్రజలు.. పెద్ద నోట్ల రద్దుపై అసహనం వ్యక్తం చేయడం సమంజసంగా లేదన్నారు. రాజకీయ నాయకులు మోదీపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2వేల నోటును కూడా రద్దు చేసి కొత్త నోటు తీసుకొస్తే స్వచ్ఛమైన ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా మోదీ నిర్ణయాన్ని స్వాగతించి సహకరించాలని నాగబాబు కోరారు.

Posted On 21st November 2016