‘లక్కున్నోడు’ టీజర్‌

మంచు విష్ణు కథానాయకుడిగా రాజ్‌కిరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లక్కున్నోడు’ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఇవాళ విష్ణు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ‘లక్కున్నోడు’లో విష్ణుకి లక్కులేనట్లు.. సరదాగా టీజర్‌ను చూపించారు. హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయింది. అచ్చు, ప్రవీణ్‌ లక్కరాజు స్వరాలు సమకూర్చారు. త్వరలో ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా విష్ణుకి ఆయన సోదరి మంచు లక్ష్మి, సోదరుడు మంచు మనోజ్‌ సోషల్‌మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘లక్కున్నోడు’ చిత్రం సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నట్లు మంచు లక్ష్మి పోస్ట్‌ చేశారు. ‘విష్ణు అన్నయ్యకి సూపర్‌ డూపర్‌ హ్యాపీ బర్త్‌డే.. లవ్యూ అన్న’ అంటూ మంచు మనోజ్‌ ఒక చక్కటి ఫ్యామిలీ ఫొటోను పోస్ట్‌ చేశారు.

Source: ఈనాడు

Posted On 23rd November 2016