‘ఎస్‌ 3’ సాంగ్‌ టీజర్‌

సూర్య కథానాయకుడిగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎస్‌ 3’. ఈ చిత్రంలోని ఓ పాట తమిళ టీజర్‌ను సూర్య సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 40 సెకెన్ల‌ నిడివి గల ఈ టీజర్‌ యూట్యూబ్‌లో విడుదలైన కొంతసేపటిలోనే 50 వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అంతేకాదు పాట బావుందని 6 వేల మంది లైక్‌ చేశారు.

‘సింగం’ సిరీస్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, శ్రుతిహాసన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. హారిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. డిసెంబరు 16న ‘ఎస్‌ 3’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Posted On 24th November 2016