పూరీ.. పక్షుల ప్రేమికుడు

విధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్‌. ఆయనకు సినిమాలను చక్కగా తెరకెక్కించి బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబట్టడమే కాదు.. మూగ జీవులతో ప్రేమగా మసులుకోవడమూ బాగా తెలుసు. తాజాగా పూరీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ శనివారం పక్షులతో అంటూ.. ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో రెండు పక్షులు పూరీని చూసిన వెంటనే ఆయన వద్దకు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చి భుజాలపైకి, తలపైకి ఎక్కి తెగ అల్లరి చేస్తూ కనిపించాయి. పూరీ కూడా వాటిని బాగా ఆడిస్తున్నారు.ఇది పక్కన పెడితే.. ఇటీవల పూరీ సోషల్‌మీడియాలో

‘దేవుడు పక్షులను ప్రేమించాడు, చెట్లను సృష్టించాడు.. మనుషులు పక్షులను ప్రేమించారు, పంజరాలను సృష్టించారు’

అంటూ ఒక ఫొటోను పోస్ట్‌ చేశారు. దీన్ని బట్టి ఆయనకు పక్షులంటే ఎంత ప్రేమో తెలుస్తుంది. పూరీ పక్షులతో ఉన్న ఆ వీడియో మీరూ చూడండి.

Posted On 10th December 2016