‘కిట్టు’ వచ్చాడు....కుక్కలు జాగ్రత్త

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా వస్తున్న చిత్రం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం రాజ్‌తరుణ్‌ తన ఫేస్‌బుక్‌ ద్వారా విడుదల చేశారు. మనుషులను కిడ్నాప్‌ చేయడం కంటే శునకాలను కిడ్నాప్‌ చేయడమే సులభమని రాజ్‌తరుణ్‌ చెప్తున్నాడు. ‘శునకాలు ఉన్నాయి జాగ్రత్త’ అని బోర్డు పెట్టి ఇల్లు కనబడిందంటే చాలు.. అక్కడ ఉన్న శునకాలను ఈ కిట్టు కిడ్నాప్‌ చేసేస్తాడంట. ఈ చిత్రంలో శునకాల దొంగ కిట్టుగా రాజ్‌తరుణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. మజ్ను చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

Posted On 11th December 2016