‘వంగవీటి’ న్యూ ట్రైలర్

విజయవాడలో జరిగిన ముఠా గొడవల నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘వంగవీటి’ చిత్రం కొత్త ట్రైలర్‌ విడుదలైంది. వర్మ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా దీన్ని అభిమానులతో పంచుకున్నారు. దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి రవిశంకర్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో వంగవీటి రాధ, వంగవీటి మోహనరంగా పాత్రల్లో సందీప్‌, చలసాని వెంకటరత్నం పాత్రలో వంశీ నక్కంటి, దేవినేని మురళి పాత్రలో వంశీ చాగంటి, దేవినేని గాంధీ పాత్రలో కౌటిల్య, రత్న కుమారి పాత్రలో నైనా గంగూలీ నటించారు. ఈనెల 23న ‘వంగవీటి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Posted On 21st December 2016