‘ఖైదీ నంబర్‌ 150’ సుందరి సాంగ్

చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. కాజల్‌ కథానాయిక. వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఇది వరకే ‘అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు...’ గీతాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. శనివారం రెండో పాటని వదిలారు. ‘సన్నా జాజిలా పుట్టేసిందిరో... మల్లే తీగలా చుట్టేసిందిరో సుందరి..’ అనే ఈ పాటకి శ్రీమణి సాహిత్యం అందించారు. జానీ మాస్టర్‌ ఈ గీతానికి నృత్యరీతులు సమకూర్చారు. జనవరి 4న విజయవాడలో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించనున్నారు. ‘‘ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘అమ్మడు..’ పాటని ఆదరిస్తున్నారు. ‘సుందరి...’ కూడా అందరికీ నచ్చుతుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’ని చిత్రబృందం తెలిపింది.

Posted On 25th December 2016