గౌతమిపుత్ర శాతకర్ణి ‘మృగ నయనా’ సాంగ్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలోని పలు పాటల మేకింగ్‌ వీడియోలు విడుదలయ్యాయి. ఈ వీడియోలను చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మంగళవారం ఈ చిత్రం ఆడియోను తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

శ్రియ, హేమమాలిని, కబీర్‌బేడీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.

Posted On 27th December 2016