‘కాటమరాయుడు’ నూతన సంవత్సర కానుక

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్ర బృందం న్యూ ఇయర్‌ కానుకగా ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సినిమా సెట్‌లో జరిగిన సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు. అంతేకాదు చిత్ర బృందం మొత్తం కలిసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఏడాది అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు.

కిషోర్‌ కుమార్‌ పార్దసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. అలీ, శివబాలాజీ, కమల్‌ కామరాజు, అజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Posted On 1st January 2017