BSNL లో 2510 జేటీవో పోస్టులు
BSNL లో 2510 జేటీవో పోస్టులు

* గేట్‌-2017 స్కోర్‌తో నియామ‌కాలు
భార‌త సంచార్ నిగ‌మ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్‌)లో 2510 జూనియ‌ర్ టెలికాం ఆఫీస‌ర్(జేటీవో) పోస్టుల‌కు ప్రక‌న‌ట విడుద‌లైంది. గ‌తంలో జేటీవో పోస్టుల‌కు బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ప‌రీక్ష నిర్వహించి, నియామ‌కాలు చేప‌ట్టేది. ఈసారి ఖాళీల‌ను గేట్‌-2017 స్కోర్‌తో భ‌ర్తీ చేయ‌నున్నారు. అందువ‌ల్ల జేటీవో పోస్టుల‌ను ఆశించేవాళ్లంతా గేట్‌-2017కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం త‌ప్పనిస‌రి.
అర్హత‌: టెలికాం/ ఎల‌క్ట్రానిక్స్/ రేడియో/ క‌ంప్యూట‌ర్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ/ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ వీటిలో ఏ విభాగంలోనైనా బీఈ/ బీటెక్ పూర్తిచేసిన‌వాళ్లు, ఎమ్మెస్సీ ఎల‌క్ట్రానిక్స్‌/ క‌ంప్యూట‌ర్ సైన్స్ చదివిన‌వాళ్లు జేటీవో పోస్టుల‌కు అర్హులు. వీరంతా గేట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 
గేట్‌లో: జేటీవో ఆశావ‌హులంతా గేట్‌లో సీఎస్ అండ్ ఐటీ/ ఈసీ/ ఈఈ/ ఐఎన్ ఈ నాలుగు పేప‌ర్ కోడ్లలో ఏదో ఒక‌దాన్ని ఎంచుకుని ప‌రీక్ష రాయాలి.
ముఖ్యమైన తేదీలు:
గేట్ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 4
వెబ్‌సైట్‌: www.gate.iitr.ernet.in
బీఎస్ఎన్ఎల్ జేటీవో రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం: జ‌న‌వ‌రి 1, 2017 నుంచి
రిజిస్ట్రేష‌న్లకు చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 31, 2017
వెబ్‌సైట్‌: www.externalbsnlexam.com
ఏయే స‌ర్కిల్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ద‌ర‌ఖాస్తు ఫీజు త‌దిత‌ర వివ‌రాల‌న్నీ డిసెంబ‌రు 1, 2016 నుంచి బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ (www.externalbsnlexam.com)లో అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టుల‌కు ఎంపికైన‌వారికి రూ.16400-40500తో వేత‌న శ్రేణి ఆరంభ‌మ‌వుతుంది.

Posted On 3rd October 2016

Source eenadu