చాక్లెట్‌, కోవా బర్ఫీ
చాక్లెట్‌, కోవా బర్ఫీ

కావల్సినవి:
కోవా - కప్పు, 
చక్కెర - పావుకప్పు, 
చాక్లెట్‌పొడి - టేబుల్‌స్పూను, 
పాలు - అరకప్పు, 
బాదం పలుకులు - కొన్ని.
తయారీ: 
పొయ్యిమీద బాణలి పెట్టి కోవాను అందులో వేయాలి. అది కాస్త వేడయ్యాక చక్కెరా, పావుకప్పు పాలు పోయాలి. చక్కెర కరిగి, ముద్దలా తయారయ్యాక దింపేయాలి. ఈ మిశ్రమాన్ని రెండుగా చేసుకోవాలి. ఒకదాన్ని నెయ్యిరాసిన పళ్లెంలోకి తీసుకోవాలి. రెండో భాగాన్ని మళ్లీ బాణలిలోకి వేసి అందులో మిగిలిన పాలూ, చాక్లెట్‌పొడీ వేసి బాగా కలపాలి. ఇది ముద్దలా అయ్యాక దింపేయాలి. ఈ చాక్లెట్‌ ముద్దను ముందుగా పరచుకున్న కోవాపై వేసి గరిటెతో నొక్కినట్లు చేయాలి. రెండుమూడు నిమిషాలయ్యాక ముక్కల్లా కోసి బాదం పలుకులు అలంకరిస్తే చాలు.

Posted On 21st October 2016

Source eenadu