ప్రాన్స్‌ సాంబార్‌ మసాలా
ప్రాన్స్‌ సాంబార్‌ మసాలా

కావల్సినవి:
నూనె - నాలుగుటేబుల్‌స్పూన్లు, 
ఉల్లిపాయలు - నాలుగు, 
కొబ్బరి తురుము - పావుకప్పు, 
వెల్లుల్లి ముద్ద - టేబుల్‌స్పూను, 
టొమాటోలు - ఆరు, 
జీలకర్రపొడి - చెంచా, 
పసుపు - చిటికెడు, 
కారం - చెంచా,
సాంబార్‌ మసాలా - చెంచా, 
నీళ్లు - కప్పు, 
వెనిగర్‌ - చెంచా, 
చక్కెర - టేబుల్‌స్పూను, 
కొత్తిమీర - కట్ట, 
ఉప్పు - తగినంత.
తయారీ:
ముందుగా బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అవి వేగాక వెల్లుల్లి ముద్ద వేయాలి. రెండు నిమిషాల తరవాత కొబ్బరి ముద్ద వేయించాలి. కొబ్బరి పచ్చివాసన పోయాక కాసిని నీళ్లు చల్లాలి. అందులో టొమాటో ముక్కలూ, తగినంత ఉప్పూ, జీలకర్రపొడి, పసుపు, కారం, సాంబార్‌ మసాలా వేసేయాలి. కొన్ని నిమిషాలకు ఇది గ్రేవీలా తయారవుతుంది. అప్పుడు శుభ్రం చేసిన రొయ్యలూ, నీళ్లూ, చక్కెరా, వెనిగర్‌ వేసి బాగా కలపాలి. రొయ్యలు ఉడికి ఇది గ్రేవీలా తయారయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే సరిపోతుంది.

Posted On 21st October 2016

Source eenadu