సమోసా
సమోసా

కావాల్సినవి: 
మైదా - ఒకటిన్నర కప్పు, 
ఉప్పు - కొద్దిగా, 
నిమ్మరసం - ఒకటిన్నర చెంచా, 
నూనె- వేయించేందుకు సరిపడా,  
ఫిల్లింగ్‌ కోసం: 
ఉల్లిపాయ - ఒకటి పెద్దది, 
కారం- అరచెంచా, 
అటుకులు- అరకప్పు (మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి), 
కొత్తిమీర- ఒక కట్ట, 
ఉప్పు -తగినంత. 
తయారీ: ఒక పాత్రలో మైదా, తగినంత ఉప్పు, నిమ్మరసం తీసుకోవాలి. అందులో గోరువెచ్చని నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ.. చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. దానిపై తడి వస్త్రాన్ని కప్పి కాసేపు నాననివ్వాలి. ఇంతలో పొయ్యిమీద బాణలి పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి ఎర్రగా వేగాక కొద్దిగా ఉప్పూ, కారం వేసి పొయ్యి కట్టేయాలి. ఆ వెంటనే మరీ అటుకుల మిశ్రమం, కొత్తిమీర తరుగు వేయాలి. అన్నింటినీ బాగా కలిపితే కూర తయారైనట్లే. నానిన మైదా మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒకదాన్ని తీసుకుని చిన్న చపాతీలా వత్తి పెనంపై ఓ అరనిమిషం కాల్చుకుని తీసుకోవాలి. ఆ చపాతీని తీసుకుని మధ్యలో చెంచా ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచి.. సమోసాలా వచ్చేలా అంచుల్ని చుట్టి మూసేయాలి. దీన్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకుంటే చాలు.

Posted On 21st October 2016

Source eenadu