పండుమిర్చి పచ్చడి
పండుమిర్చి పచ్చడి

కావల్సినవి:
పండుమిర్చి - ముప్ఫై, 
నిమ్మరసం - కప్పు, 
బెల్లం - పావుకప్పు, 
నూనె - టేబుల్‌స్పూను, 
ఉప్పు - తగినంత, 
వేయించిన జీలకర్ర పొడి - చెంచా, 
వేయించిన మెంతుల పొడి - అరచెంచా, 
తాలింపు గింజలు - చెంచా.
తయారీ:
పండుమిర్చిని నిమ్మరసంలో నానబెట్టుకోవాలి. అరగంటయ్యాక తగినంత ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఓ గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకుని బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక ముందుగా రుబ్బిపెట్టుకున్న పండుమిర్చి ముద్దను వేసేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. మరో బాణలిలో నూనె వేడిచేసి తాలింపు గింజలు వేయించి ఉడుకుతోన్న పండుమిర్చి ముద్దలో వేసి బాగా కలపాలి. దింపేందుకు ఐదు నిమిషాల ముందు జీలకర్రపొడి, మెంతిపొడి కలిపితే సరిపోతుంది. దీన్ని కావాలనుకుంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు.

Posted On 21st October 2016

Source eenadu