మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ లస్సీ
మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ లస్సీ

కావల్సినవి:
పెరుగు - కప్పు, 
యాపిల్‌, 
అరటిపండు -సగం చొప్పున,
తియ్యని ద్రాక్షపండ్లు - కొన్ని, 
సపోటా - ఒకటి, 
చక్కెర - పావుకప్పు, 
తేనె - రెండు చెంచాలు,
మిక్స్‌డ్‌ఫ్రూట్‌ ఎసెన్స్‌ - రెండు చుక్కలు.
తయారీ:
ముందుగా పండ్లముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీటితోపాటూ మిగిలిన పదార్థాలన్నీ మిక్సీలోకి తీసుకుని లస్సీలా చేసుకోవాలి. ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి పండ్లముక్కలన్నీ మెత్తగా అయ్యాక కాసిని చల్లనినీళ్లు పోసి మరోసారి మిక్సీపట్టాలి. అంతే పండ్లలస్సీ సిద్ధం. దీనిపై కొద్దిగా ఐస్‌క్రీం లేదా జామ్‌ వేసుకుని తాగితే చాలా రుచిగా ఉంటుంది.

Posted On 21st October 2016

Source eenadu