Foodpanda CPS (IN)
సొజ్జప్పాలు
సొజ్జప్పాలు

కావలసిన పదార్థాలు: 
గోధుమ రవ్వ- రెండు కప్పులు, 
పచ్చికొబ్బరి తురుము- రెండు కప్పులు, 
చక్కెర- రెండు కప్పులు, 
యాలకుల పొడి- ఒక టీ స్పూను, 
మైదా- నాలుగు కప్పులు, 
ఉప్పు- చిటికెడు, 
నెయ్యి- ఒక టేబుల్‌ స్పూను,
పాలు- రెండు కప్పులు, 
నూనె- వేగించడానికి సరిపడా, 
నీళ్లు- తగినన్ని. 
 
తయారీ విధానం: బాణలిలో నెయ్యి వేసి వేడెక్కాక గోధుమ రవ్వ, పచ్చికొబ్బరి తురుము వేసి వేగించాలి. ఈ మిశ్రమంలో పాలు పోసి ఒక విజిల్‌ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత యాలకుల పొడి, చక్కెర వేసి మరో పది నిమిషాలు ఉడికించి దించేయాలి. ఆ తర్వాత మైదా పిండిని కలుపుకొని చపాతీలు చేసుకోవాలి. ఈ చపాతీల మధ్యలో రవ్వ మిశ్రమాన్ని పెట్టి బొబ్బట్లలా చుట్టుకొని పెనం మీద నూనె వేస్తూ కాల్చుకోవాలి. 

Posted On 18th October 2016

Source andhrajyothi