Foodpanda CPS (IN)
సీలావతితో పులుసు
సీలావతితో పులుసు

కావల్సినవి:
శీలావతి- 700గ్రా, 
ఉల్లిపాయ ముక్కలు - ఒకటిన్నరకప్పు, 
పచ్చిమిర్చి- ఆరు, 
పసుపు- అరచెంచా, 
కారం - రెండున్నర చెంచాలు, 
ఉప్పు - తగినంత, 
చింతపండు - 150 గ్రా (చిక్కని రసం తీసుకోవాలి), 
నూనె- 150 గ్రా, 
ఫిష్‌ మసాలా - రెండు చెంచాలు, 
కొత్తిమీర తరుగు - కొద్దిగా.
తయారీ:
ముందుగా కల్లుప్పుతో రుద్ది శుభ్రం చేసుకోవాలి. అప్పుడే జిగురు లేకుండా ఉంటాయి. వాటికి పసుపు, ఉప్పు, కారం, చెంచా చేపమసాలా పొడిని కలిపి పక్కన పెట్టుకోవాలి. పదినిమిషాల పాటు ఉంచితే ముక్కలకు ఉప్పు, కారం చక్కగా పడుతుంది ఇప్పుడు కడాయిలో నూనె వేడిచేసి నిలువుగా చీల్చిన పెట్టుకొన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి బాణలితోపాటు తీసిపెట్టుకోవాలి. వేడి కొద్దిగా తగ్గాక అందులో కారం పట్టించిన చేప ముక్కలను వాటిపై సర్దాలి. ఇలా చల్లారిన తర్వాత చేప ముక్కలని వేయడం వల్ల చేప వేడికి విడిపోకుండా ఉంటుంది. ఆ బాణలిలో అరగ్లాసు నీళ్లు, కరివేపాకు వేసి పొయ్యి మీద పెట్టాలి. అది మరుగుతుండగా చింతపండు రసాన్ని ముక్కలకు తగ్గట్టుగా వేసుకుని ఆ తరవాత తగినంత ఉప్పు చేర్చాలి. ముక్క బాగా ఉడికి చక్కని వాసన వస్తుండగా అందులో మిగిలిన చేప మసాలాను వేసి దింపేయాలి. దానిపై కొద్దిగా కొత్తిమీర వేసి అలంకరించుకొంటే చేపల పులుసు సిద్ధం. వేడివేడిగా లేదా బాగా చల్లారిన తర్వాత ఎలా తిన్నా రుచిగానే ఉంటుంది.

Posted On 19th October 2016

Source eenadu