చిలగడదుంప వడలు
చిలగడదుంప వడలు

కావలసినవి 
చిలగడదుంపలు: రెండు, 
సెనగపిండి: అరకప్పు, 
బియ్యప్పిండి: 2 టీస్పూన్లు, 
అల్లం, పచ్చిమిర్చి ముద్ద: 2 టీస్పూన్లు, 
కొత్తిమీర తురుము: పావుకప్పు, 
కరివేపాకు: 4 రెమ్మలు, 
ఉప్పు: తగినంత, 
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* ముందుగా చిలగడదుంపలను ఉడికించి పొట్టు తీసేసి మెత్తగా చిదమాలి. దీన్ని ఓ గిన్నెలో వేసి అందులోనే అల్లం, పచ్చిమిర్చిముద్ద, సెనగపిండి, బియ్యప్పిండి, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ ముద్దను చిన్న చిన్న వడల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీస్తే చిలగడదుంప వడలు రెడీ.

Posted On 19th October 2016

Source eenadu