ఉల్లి-టొమాటో చట్నీ
ఉల్లి-టొమాటో చట్నీ

కావలసినవి:
ఉల్లిపాయలు(పెద్దవి): రెండు, 
టొమాటో: ఒకటి, 
ఎండుమిర్చి: ఐదు, 
వెల్లుల్లిరెబ్బలు: నాలుగు, 
ఇంగువ: అరటీస్పూను, 
ఉప్పు: టీస్పూను, 
నూనె: 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం:
ఉల్లిపాయలు పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. టొమాటోలు కూడా ముక్కలుగా కోయాలి.బాణలిలో నూనె పోసి ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ముక్కలు రంగు మారి మృదువుగా అయ్యాక ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ వేసి వేయించాలి. వెల్లుల్లి పచ్చి వాసన పోయాక టొమాటో ముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి. టొమాటో ముక్కలు ఉడికిన తరవాత దించి చల్లారనివ్వాలి.ఆరిన తరవాత మిక్సీలో వేసి నీళ్లు లేకుండా మెత్తగా రుబ్బాలి.

Posted On 19th October 2016

Source eenadu