బనానా స్ట్రాబెర్రీ మ్యాజిక్‌
బనానా స్ట్రాబెర్రీ మ్యాజిక్‌

కావల్సినవి:
తేనె - ఐదు టేబుల్‌స్పూన్లు, 
అరటిపండ్లు - రెండు, 
స్ట్రాబెర్రీలు - పది నుంచి పన్నెండు (బదులుగా వేరే పండు వాడొచ్చు) 
వెనిల్లా ఐస్‌క్రీం - ఒకటిన్నర కప్పు, 
ఐసుముక్కలు - ఎనిమిది నుంచి పది.
తయారీ:
అరటిపండ్లు, స్ట్రాబెర్రీలను ముక్కలుగా చేసి ఫ్రీజర్‌లో ఉంచాలి. గంట తరవాత వాటిని మిక్సీలో తీసుకోవాలి. అందులో తేనె, ఐస్‌క్రీం వేసి మరోసారి మెత్తగా చేసుకోవాలి. అది చిక్కని పానీయంలా తయారయ్యాక అప్పుడు ఐసుముక్కలు వేసి మరోసారి మిక్సీ తిప్పాలి. ఈ పానీయాన్ని గ్లాసుల్లోకి తీసుకోవాలి.

Posted On 19th October 2016

Source eenadu