బ్రాడ్‌మన్‌, ద్రవిడ్‌ల రికార్డు చెరిపేసిన కోహ్లి
బ్రాడ్‌మన్‌, ద్రవిడ్‌ల రికార్డు చెరిపేసిన కోహ్లి

సమాకాలీన క్రికెట్‌లో పరుగుల యంత్రంగా మారి రికార్డుల రారాజుగా పిలుపించుకుంటున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రస్తుత క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడంటూ దిగ్గజాల చేత మన్ననలు అందుకుంటున్న కోహ్లి దిగ్గజాల రికార్డులనే చెరిపేస్తున్నాడు. గతేడాది టెస్టుల్లో మూడు ద్విశతకాలు సాధించిన కోహ్లి ఈ ఏడాది మరో ద్విశతకంతో టెస్టులను ఘనంగా ఆరంభించాడు. గతేడాది మూడు టెస్టు సిరీస్‌ల్లో (వెస్టిండీస్‌పై 200, న్యూజిలాండ్‌పై 211, ఇంగ్లండ్‌పై 235) ద్విశతకాలు సాధించిన కోహ్లి.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లోనూ ద్విశతకం(204) బాదాడు. తద్వారా వరుసగా నాలుగు సిరీస్‌ల్లో ద్విశతకాలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.గతంలో బ్రాడ్‌మన్‌, ద్రవిడ్‌ మూడు వరుస సిరీస్‌ల్లో ద్విశతకాలు సాధించారు. బంగ్లాపై ద్విశతకంతో వారి రికార్డును చెరిపేసిన కోహ్లి.. సరికొత్త రికార్డుతో దిగ్గజ ఆటగాళ్లను దాటేశాడు.

Posted On 11th February 2017

Source eenadu