క్యాన్సర్ బాధిత నగరాల్లో 3 స్థానంలో హైదరాబాద్
క్యాన్సర్ బాధిత నగరాల్లో 3 స్థానంలో హైదరాబాద్

దేశంలో కేన్సర్‌ బాధిత మూడో స్థానం భాగ్యనగరానిదే! 

 ఏటా 2400 కొత్త కేసుల నమోదు 

 పొగాకే ప్రథమ శత్రువు 

 ఎలక్ర్టానిక్‌ సిగరెట్లు మరీ డేంజర్‌ 

 ‘ప్రపంచ కేన్సర్‌ దినం’ సర్వే వెల్లడి 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: హైదరాబాద్‌.. కేన్సర్‌ కోరల్లో చిక్కుకుంది! ఈ నగరంలో ఏటా 2400 కొత్త కేన్సర్‌ కేసులు నమోదవుతుండడమే దీని కి ప్రబల సాక్ష్యం! ఇక్కడ రొమ్ము కేన్సర్‌ బాధితులే ఎక్కువ. ఇక, ఊపిరితిత్తులు, నోటి, నాలు క, గొంతు కేన్సర్‌ కేసుల సంఖ్యా భారీగానే ఉం ది. దేశ వ్యాప్తంగా కేన్సర్‌ బాధిత రాష్ర్టాలనుబ ట్టి చూస్తే హరియాణా, ఢిల్లీల తర్వాతి స్థానం లో ఉత్తరప్రదేశ్‌ ఉంటే.. నగరాల్లో హైదరాబాద్‌దేనని ఢిల్లీకి చెందిన ఫోర్టిస్‌ మెమోరియల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎ్‌ఫఎంఆర్‌ఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. రొమ్ము కేన్సర్‌ బాధితుల్లో మహిళలు, ఊపిరితిత్తుల కేసుల్లో పురుషులు, గొంతు, నాలుక కేన్సర్‌ కేసుల్లో చిన్నారుల సం ఖ్య ఎక్కువగా ఉంది. 50 నుంచి 55 ఏళ్ల మద్య వయసున్న పురుషులు, మహిళలు ఎక్కువగా కేన్సర్‌ బారిన పడుతుంటే హైదరాబాద్‌లో 15 ఏళ్లలోపు చిన్నారులు కూడా కేన్సర్‌కు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 2020 నాటికి దేశంలో 17.3 లక్షల మంది కొత్త గా కేన్సర్‌ బాధితులుగా మారతారని శనివారం ‘ప్రపంచ కేన్సర్‌ దినం’ సందర్భంగా ఎఫ్‌ఎంఆర్‌ఐ నివేదిక విడుదల చేసింది. 

 

ఎక్కువగా నమోదవుతున్న కేన్సర్‌ కేసులు

రొమ్ము, గర్భాశయ,ఊపిరితిత్తులు, నాలుక కేన్సర్‌లు 

 

పురుషుల్లో బాధితులు ఇలా..

ఊపిరితిత్తుల కేన్సర్‌ : 31.2శాతం 

మూత్రాశయ కేన్సర్‌ : 16.5శాతం 

నోటి కేన్సర్‌ : 16.5శాతం

నాలుక కేన్సర్‌ : 11.8శాతం గొంతు కేన్సర్‌ : 10శాతం

 

మహిళా బాధితులు ఇలా..

ఊపిరితిత్తుల కేన్సర్‌ : 36.5శాతం 

అన్నవాహిక కేన్సర్‌ : 18.8శాతం 

మూత్రాశయ కేన్సర్‌ : 15.3శాతం 

నోటి కేన్సర్‌ : 12.9శాతం

నాలుక కేన్సర్‌ : 10.6శాతం

 

చిన్నారుల్లో..

మొత్తం కేసుల్లో 5.8శాతం వీరివే 

బాలికల్లో 4.6శాతం కేసులు, బాలురిలో 6.6శాతం కేసులు నమోదు 

 

భారత వైద్య పరిశోధన మండలి లెక్కల ప్రకారం.. 

2020 నాటికి 17.3 లక్షల మంది కొత్త కేన్సర్‌ కేసులు నమోదయ్యే అవకాశం 

 

హైదరాబాద్‌లో ఇలా ఉంది.. 

 మహిళల్లో రొమ్ము కేన్సర్‌ పెరుగుతోంది 

 15 ఏళ్లలోపు చిన్నారులు కూడా పొగాకుకి అలవాటు పడుతున్నారు 

 ఫలితంగా నోటి, గొంతు కేన్సర్లు పెరుగుతున్నాయి 

 హైదరాబాద్‌లోని అన్ని కేన్సర్‌ ఆస్పత్రుల్లోనూ రోజుకు సగటున 10 కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

 ప్రభుత్వం తరఫున అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాల్సి ఉంది. జూ పొగాకు వినియోగంపై నిబంధనలను కఠిన తరం చేయాల్సి ఉంది. 

 

పొగాకు నమలడం/తాగడం వల్ల.. 

 23.4శాతం మంది పురుషులు కేన్సర్‌ బారిన పడుతున్నారు. 

 8.8:శాతం మంది మహిళలు కేన్సర్‌తో బాధపడుతున్నారు. 

 హరియాణా సహా హైదరాబాద్‌లో నమోదవుతున్న కేసులు ఎక్కువ ఇవే. 

 

భారత్ యుద్ధానికి దిగాలి! 

దేశాన్ని కబళిస్తున్న కేన్సర్‌ మహమ్మారిని తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధానికి దిగాలని భారత ఆరోగ్య సంరక్షణ సంఘం సూచించింది. గుండె జబ్బుల తర్వాత రెండో ప్రాణాంతక జబ్బుగా మారిన కేన్సర్‌పై తక్షణమే యుద్ధం ప్రకటించాలని కోరింది. ప్రపంచ కేన్సర్‌ దినం సందర్భంగా సంఘం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 

 

కేన్సర్‌ కారకాలు

ప్రథమ స్థానం: పొగాకు వినియోగం 

రెండో స్థానం: ఆల్కహాల్‌ 

మూడో స్థానం: పచ్చి వక్క 

నాలుగో స్థానం: స్థూల కాయం

Posted On 14th February 2017

Source andhrajyothi