ట్రాఫిక్ వల్ల కలిగే మానసిక సమస్య
ట్రాఫిక్ వల్ల కలిగే మానసిక సమస్య

రద్దీగా ఉండే రోడ్ల పక్కన చాలామంది నివాసముంటున్నారు. అయితే అలా నివాసంముంటున్నవారు ట్రాఫిక్‌ వల్ల  ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అనే అంశం మీద కెనడాలోని హంగ్ చెన్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. అయితే రద్దీగా ఉండే రోడ్ల పక్కన నివసిస్తున్న వారు తీవ్రమైన మానసిక సమస్య ఎదుర్కొంటున్నారనీ, ఆ సర్వేలో తేలింది. సుమారు 50 మీటర్లకంటే దగ్గరగా ఉంటున్న వారిలోనైతే ఈ సమస్య తీవ్రంగా ఉంటోందని సంస్ధ ప్రతినిధులు తెలిపారు.

ఈ సమస్యకు వారు డెమన్టీయా అని పేరు కూడా పెట్టారు. 2001 నుంచి 2012 వరకు సుమారు పదమూడు సంవత్సరాలు ఈ సర్వే కొనసాగించినట్టు వారు తెలిపారు. 50 మీటర్ల కంటే దగ్గర రోడ్ల పక్కన నివసిస్తున్నవారిలో డెమన్టీయా వచ్చే అవకాశం 7 శాతం ఎక్కువగా ఉంటోందని, అదేవిధంగా 50-100 మీటర్ల మధ్య నివసిస్తున్నవారికి 4 శాతంగా ఉందనీ, అలాగే 100-200 మీటర్ల దూరంలో నివాసం ఉంటున్నవారిలో 2 శాతంగా ఉందనీ వారు తెలిపారు. 200 మీటర్లు అంతకంటే ఎక్కువ దూరంగా నివసిస్తున్నవారిలో ఈ లక్షణాలేవి కనిపించలేదని వారు చెప్పారు. డెమన్టీయా వచ్చినవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని ఇది ఒకరకంగా అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుందని వారంటున్నారు. రద్దీగా ఉండే రోడ్ల మీద నైట్రోజన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ దుష్ప్రభావం కలుగుతుందని వారంటున్నారు.

Posted On 14th February 2017

Source andhrajyothi