దంపుడు బియ్యంతో బరువు తగ్గొచ్చు
దంపుడు బియ్యంతో బరువు తగ్గొచ్చు

అదనపు బరువును వదిలించుకోవాలా.. అయితే, దంపుడు బియ్యం(బ్రౌన్‌ రైస్‌) తినండి అంటూ శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. సాధారణ బియ్యంతో పోలిస్తే దంపుడు బియ్యం ఆరోగ్యకరమనే విషయం తెలిసిందే! రోజువారీ ఆహారంలో దంపుడు బియ్యం సహా ఇతర తృణధాన్యాలకు చోటివ్వడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడుతుందని, బరువు తగ్గి చురుకుదనం పెరుగుతుందని తాజా పరిశోధన తేల్చిందని టఫ్ట్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. రోజువారీగా మనం ఖర్చుచేసే కాలరీలకు అదనంగా వంద కాలరీలను శరీరం వదిలించుకుంటుందని తెలిపారు. ఇక దీర్ఘకాలిక వ్యాధుల ముప్పునూ ఈ తృణధాన్యాలు తగ్గిస్తాయని వారు వివరించారు.

Posted On 14th February 2017

Source andhrajyothi