థర్మామీటర్‌ ఎంతసేపు ఉంచాలి ?
థర్మామీటర్‌ ఎంతసేపు ఉంచాలి ?

జ్వరం వచ్చినపుడు థర్మామీటర్‌తో కొలిచి జ్వరం తీవ్రతను తెలుసుకుంటాం. కానీ చాలామందికి దీన్ని ఎంతసేపు నాలుక కింద పెట్టుకోవాలో తెలియదు. గాజు థర్మామీటరైతే మూడు నిమిషాల సేపు నాలుక కింద ఉంచుకుంటే జ్వరం తీవ్రత కచ్చితంగా బయటపడుతుంది. ప్రస్తుతం డిజిటల్‌ థర్మామీటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటినైతే ‘బీప్‌’ చప్పుడు వచ్చేంతవరకు నాలుక కింద పెట్టుకోవాలి. డిజిటల్‌ థర్మామీటర్లను వినియోగించటం తేలిక. ఫలితం కూడా త్వరగా తెలుస్తుంది. అందుకే గాజు థర్మామీటర్ల కన్నా డిజిటల్‌ థర్మామీటర్లు వాడుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గాజు థర్మామీటరును నోట్లో పెడితే పిల్లలు కొరికే ప్రమాదముంది. దీంతో దానిలోని పాదరసం బయటకు వచ్చి, పిల్లలు మింగే ప్రమాదముంది. కాబట్టి పిల్లల విషయంలో గాజు థర్మామీటరు వాడకపోవడమే ఉత్తమం.

Posted On 14th February 2017

Source eenadu