కరణ్‌ స్కోరే.. కారు నంబర్‌గా
కరణ్‌ స్కోరే.. కారు నంబర్‌గా

కరణ్‌ నాయర్‌.. ప్రస్తుతం భారత క్రికెట్‌ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో సెహ్వాగ్‌ తర్వాత భారత్‌ తరఫున ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆటగాడు. తాజాగా కరణ్‌ కొనుగోలు చేసిన ఫోర్డ్‌ ముస్టాగ్‌ కారు ఫోటోను అభిమానులతో పంచుకొని ఇది ‘నా వాలెంటైన్‌’ అని ట్వీట్‌ చేశాడు. రెండు నెలల క్రితం ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో కరణ్‌ 303 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. తాను కొనుగోలు చేసిన కారు నంబర్‌లో తన పేరులోని మొదటి ఆంగ్ల అక్షరాలతో పాటు అత్యధిక స్కోరు 303 కారు నంబర్‌ ప్లేట్‌పై ఉంది. బహుశా అదే తన కారు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కావొచ్చు.

కారు నంబర్‌ ప్లేట్‌ ప్రత్యేకత 
కరణ్‌లోని మొదటి రెండు ఆంగ్ల అక్షరాలు ‘కేఏ’, అనంతరం ‘03’ సంఖ్య, నాయర్‌లోని మొదటి ఆంగ్ల అక్షరాలు ‘ఎన్‌ఏ’ తర్వాత తన వ్యక్తిగత అత్యధిక స్కోరు ‘303’ కొత్త కారు నంబర్‌ ప్లేట్‌పై ఉంది. తాను సాధించిన చరిత్రాత్మక ఇన్నింగ్స్‌కు గుర్తుగా ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ పొందినట్లు తెలుస్తోంది.

Posted On 16th February 2017

Source eenadu