క్రికెటర్ జడేజా కారుకు ప్రమాదం
క్రికెటర్ జడేజా కారుకు ప్రమాదం

భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కారుకు యాక్సిడెంట్ అయ్యింది. జడేజా తన భార్య రీవా సోలంకితో పాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రయాణిస్తున్నాడు. అయితే ఈ కారు వెనకవైపు నుంచి ఒక మోపెడ్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో జడేజా దంపతులకు ప్రమాదమేమీ కాలేదు. అయితే విద్యానగర్‌లో చదువుకుంటున్న ప్రీతీ శర్మ అనే విద్యార్ధినికి మాత్రం ఈ ప్రమాద ఘటనలో గాయాలయ్యాయి. జడేజా వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఆమెకు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని, ఎటువంటి ప్రమాదం కాలేదని సమాచారం. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత 28 సంవత్సరాల జడేజాకు సెలక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

Posted On 28th January 2017

Source andhrajyothi