కాబిల్‌ చూసి సెహ్వాగ్‌ బౌల్డ్‌
కాబిల్‌ చూసి సెహ్వాగ్‌ బౌల్డ్‌

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో నటించిన కాబిల్‌ చిత్రం ఈ నెల 25న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అభిమానుల నుంచి మిశ్రమ స్పందన కూడా అందుకుంది. ఇప్పటికే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా మాజీ క్రికెటర్‌, ట్విటర్‌ కింగ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సామాజిక మాధ్యమం ట్విటర్‌లో స్పందించారు. ‘కాబిల్‌ చిత్రాన్ని వీక్షిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన సినిమా. హృతిక్‌ రోషన్‌ నటన చాలా బాగుందని’ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

Posted On 28th January 2017

Source eenadu