అద్భుతం చేసిన బూమ్రా, భారత్ విజయం
అద్భుతం చేసిన బూమ్రా, భారత్ విజయం

చివరి వరకూ ఉత్కంఠగా సాగిన సెకండ్ టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుపై కోహ్లీ సేన 5 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది. దీంతో ఫిబ్రవరి 1న జరగబోయే మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది. ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్ బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి, నాలుగో బంతుల్లో వికెట్లు తీశాడు. చివరి బంతికి సిక్సర్ కొట్టాల్సి ఉండగా బ్యాటింగ్ చేస్తున్న మోయిన్ అలీని బోల్తా కొట్టించి ఒక్క రన్ కూడా తీయకుండా చేశాడు. అటు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌కు కూడా టెన్షన్ పెరిగింది. మైదానంలో కూడా అందరూ టెన్షన్‌గా మారిపోయారు. నిజానికి మూడు ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి సమయంలో బూమ్రా 18వ ఓవర్ వేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాత ఓవర్ వేసిన నెహ్రా 16 పరుగులు ఇచ్చాడు. అయితే చివరి ఓవర్‌ను వేసిన బూమ్రా మ్యాజిక్ చేసి మ్యాచ్ గెలిపించాడు.

Posted On 29th January 2017

Source andhrajyothi